Australia | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: భారత్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా 1000 వరకు వర్క్, హాలిడే వీసాలను భారతీయులకు మంజూరు చేయబోతున్నట్టు గురువారం ప్రకటించింది. ఉద్యోగం, ఉన్నత విద్య, పర్యాటకం నిమిత్తం ఒక ఏడాదిపాటు ఆస్ట్రేలియాలో ఉండేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది. 18 నుంచి 30 ఏండ్ల భారత పౌరులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
‘మతంతో సంబంధం లేకుండా గృహహింస చట్టం వర్తింపు’
న్యూఢిల్లీ: గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం-2005 మతం, సామాజిక హోదాతో సంబంధం లేకుండా దేశంలోని మహిళలందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం మహిళల రక్షణకు హామీ కల్పించే ఈ చట్టం సివిల్కోడ్లో భాగమని ధర్మాసనం స్పష్టం చేసింది. తనకు భరణం, నష్టపరిహారం విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.