కోల్‌కతా, జనవరి 7: ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అధికారులను ఆదేశించారు. షాజహాన్ సరిహద్దు దాటి ఉండవచ్చని, వెంటనే అరెస్ట్ చేసి ఉగ్రవాదులతో అతనికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలంటూ గవర్నర్ శనివారం రాత్రి పోలీస్ చీఫ్‌ను ఆదేశించినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. కాగా, షాజహాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు గవర్నర్ చేసిన ఆరోపణలపై అధికార టీఎంసీ మండిపడింది. దీనిపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడుతూ గవర్నర్ ఏ అధారాలతో ఈ ఆరోపణలు చేశారో అర్ధం కావడం లేదని అన్నారు. షాజహాన్‌పై ఎలాంటి ఆధారాలు, నివేదిక లేకుండా ఆయన అలా ఎలా ఆరోపణలు చేస్తారు? అయనున్నది బెంగాల్లో సమాంతర ప్రభుత్వం నడపడానికి కాదని విమర్శించారు.