Road Accident | పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. నదియా (Nadia) జిల్లాలో బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోల్కతా వెళ్తున్న ఓ కారు కాంథాలియా ప్రాంతానికి సమీపంలోని కృష్ణనగర్-కరీంపూర్ రాష్ట్ర రహదారిపై బస్సును ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో పలువురు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
Also Read..
Corona Virus | మహారాష్ట్రలో కోరలు చాస్తున్న కరోనా.. వారం రోజుల్లోనే భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
Car Parking | పార్కింగ్ స్థలం చూపిస్తేనే వాహనానికి రిజిస్ట్రేషన్ : మహారాష్ట్ర ప్రభుత్వం