Corona Virus | మహారాష్ట్రలో కోరలు చాస్తున్న కరోనా.. వారం రోజుల్లోనే భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
Corona Virus | నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి (Corona Virus) ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది.
Corona Virus | నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి (Corona Virus) ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ (Covid-19) కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక భారత్‌లోనూ 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయినప్పటికీ దేశంలో కొవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
కాగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 12 నుంచి 56కి పెరిగింది. అంతేకాదు మరణాలు కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇక దేశంలో అత్యధికంగా కేరళలో 95 కొవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో 257 కొవిడ్ కేసులు
సింగపూర్, హాంకాంగ్‌లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) సమీక్షా సమావేశం నిర్వహించింది. మన దేశంలో ప్రస్తుతం 257 కొవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇవి స్వల్ప లక్షణాలు గల కేసులని, వ్యాధిగ్రస్థులను దవాఖానలలో చేర్పించి, చికిత్స చేయవలసిన అవసరం లేదని వివరించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read..
Car Parking | పార్కింగ్ స్థలం చూపిస్తేనే వాహనానికి రిజిస్ట్రేషన్ : మహారాష్ట్ర ప్రభుత్వం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

