Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మరణించారు. మరో 15 మంది వరకు గాయపడ్డారు.
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు మరణించారు. మరో 15 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌లోని, ఉధంపూర్ జిల్లాలో బుధవారం ఉదయం 8.00 గంటల సమయంలో జరిగింది. బస్సు రాం నగర్ నుంచి పెచౌండ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బస్సు బసంత్‌గఢ్ తహసిల్ పరిధిలోని, గల్లి గాలా ప్రాంతంలో అతి వేగం కారణంగా అదుపుతప్పింది. దీంతో బస్సు పట్టు జారి కిందనున్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో బస్సు నుజ్జునుజ్జయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. రెస్క్యూ బృందాలు, సీనియర్ ఉన్నతాధికారులు, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించే పనులు చేపట్టారు. బాధితుల్ని బసంత్గఢ్తోపాటు, రాంనగర్‌లోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వారికి చికిత్స అందుతోంది. మరో ఇద్దరు మరణించారు.
Unfortunately, two casualties have been reported. 10 injured have reached SDH Ramnagar. Out of 10, 3 are on way to GMC Udhampur. 3 more ambulances are about to reach SDH Ramnagar.
Meanwhile, I have taken up the issue of construction of Ramnagar to Basantgarh road with the BRO authorities at Delhi.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) October 21, 2026
వారి మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి, ఉధంపూర్ ఎంపీ జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాద స్థలానికి అంబులెన్సులు పంపించి సహాయక చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ మార్గంలో రోడ్డు నిర్మాణం గురించి కూడా అధికారులతో చర్చించినట్లు వివరించారు. గత వారం కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదం జరగగా.. 18 మంది గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ ఘన విజయం
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

