Delhi | ఢిల్లీలో విషాదం.. రెస్టారెంట్లో అగ్నిప్రమాదం.. 21 మంది మృతి
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒక రెస్టారెంట్లో బధవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 21 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒక రెస్టారెంట్లో బధవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 21 మంది మరణించినట్లు తెలుస్తోంది. మ1తుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఢిల్లీ, మాల్వియ నగర్‌లోని లెమన్ గ్రీన్ అనే రెస్టారెంట్లో ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది.
రెస్టారెంట్ బేస్మెంట్లో మొదలైన మంటలు తర్వాత పై అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది మరణించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సిబ్బంది శ్రమించి పలువురిని రక్షించారు. అందులో అగ్నిప్రమాదం మొదలైన బేస్మెంట్లో చిక్కుకున్న పలువురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
VIDEO | Death toll in fire in restaurant in south Delhi’s Malviya Nagar goes up to 18, many of those killed are foreigners: officials. Latest visuals from the spot as relief and rescue operations continue.#DelhiNews #MalviyaNagarFire
(Full video available on PTI Videos -… pic.twitter.com/entmWpFjw0
— Press Trust of India (@PTI_News) June 3, 2026
ఘటనా స్థలంలో 10 అగ్నిమాపక యంత్రాలు పని చేస్తున్నాయి. అలాగే, క్షతగాత్రుల్ని రక్షించడానికి అంబులెన్స్‌ల్ని కూడా అధికారులు సిద్ధం చేశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తగిన వైద్య సహాయం అందించాల్సిందిగా సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- fire
- Malviya Nagar
- Restaurant
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

