గువాహటి: ముస్లింల వివాహ, విడాకుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటి నమోదును తప్పనిసరి చేస్తూ అస్సాం శాసనసభ గురువారం బిల్లును ఆమోదించింది.
సీఎం హిమంత మాట్లాడుతూ, గతంలో ఖాజీలు నిర్వహించిన వివాహాలు చెల్లుబాటు అవుతాయని, కొత్త చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచి వివాహాలను వారు నమోదు చేయరాదని, తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు.