న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన తన పదవీ విరమణ తేదీ 2027 నవంబరు 30 వరకు కొనసాగుతారు. క్యాబినెట్ నియామకాల కమిటీ శనివారం ఈ మేరకు ఆదేశాలను విడుదల చేసింది.
ఆయన ప్రస్తుతం అస్సాం డీజీపీగా పని చేస్తున్నారు. ఆయన 1991 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారి. అనీష్ దయాల్ సింగ్ గత నెల 31న పదవీ విరమణ చేసినప్పటి నుంచి అఫిషియేటింగ్ ఛార్జిని వితుల్ కుమార్ నిర్వహిస్తున్నారు.