దిస్పూర్, జూలై 10 : ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని ప్రతిపాదిస్తూ శుక్రవారం ఒక బిల్లును శానససభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జయంత్ మల్లా బారుహ్ మాట్లాడుతూ బహుభార్యత్వంతో ఉంటూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న వారిని కూడా నిరోధించాలని భావిస్తున్నట్టు చెప్పారు.
మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు, లింగ వివక్షను నివారించేందుకు ఒకరు కన్నా ఎక్కువ మంది భార్యలు కలిగి ఉన్న పురుషులు ఇకపై ప్రభుత్వ పథకాలకు అర్హులు కారని తెలిపారు.