గువాహటి: బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదివారం చెప్పారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించవచ్చునని తెలిపారు.
రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో ఉన్న ప్రాంతాలకు ఇది వర్తించదన్నారు. బహుభార్యత్వ బాధిత మహిళలు తమ జీవితాలను కొనసాగించడంలో ఇబ్బందులు పడకుండా చూడటం కోసం, వారికి ఆర్థిక సాయం చేసేందుకు కొత్తగా ఓ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లును ఈ నెల 25న శాసన సభలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.