గౌహతి: బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనుస్ ఇటీవల చైనాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన భారత్కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలపై కామెంట్ చేశారు. తమ ప్రాంతంలో సముద్ర సంరక్షకులం తామే అని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ పేర్కొన్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ(CM Himanta Biswa Sarma) స్పందించారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనుస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు దురుద్దేశ పూర్వకంగా ఉన్నట్లు తెలిపారు.
ఇటీవల నాలుగు రోజుల పాటు యూనుస్ చైనాలో పర్యటించారు. భారత్కు చెందిన ఈశాన్య రాష్ట్రాలపై అక్కడ యూనుస్ వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రాల భూభాగం ల్యాండ్లాక్ అయ్యిందని, ఆర్థిక అవసరాల నిమిత్తం తమకు సాయం చేయాలని చైనాను యూనుస్ కోరారు. ఈశాన్య రాష్ట్రాలకు పట్టులేకపోవడం వల్ల.. ఆ ప్రాంతంలో సముద్ర సంరక్షణ బంగ్లాదేశ్ చూసుకుంటుందని యూనుస్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బిశ్వ శర్మ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. యూనుస్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను తేలికగా తీసుకోవద్దు అని సీఎం తెలిపారు. బంగ్లా చీఫ్ వ్యాఖ్యలు వ్యూహాత్మక, సుదీర్ఘ ప్రయోజనాలతో ఉన్నట్లు పేర్కొన్నారు.
The statement made by Md Younis of Bangladesh so called interim Government referring to the seven sister states of Northeast India as landlocked and positioning Bangladesh as their guardian of ocean access, is offensive and strongly condemnable. This remark underscores the…
— Himanta Biswa Sarma (@himantabiswa) April 1, 2025