శనివారం 16 జనవరి 2021
National - Dec 14, 2020 , 10:33:05

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం

న్యూయార్క్‌ : అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. క్రిస్మస్‌ను సందర్భంగా ప్రఖ్యాత కెథడ్రల్‌ చర్చిలో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో  ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దుండగుడు దాదాపు 20 సార్లు కాల్పులు జరపడంతో అక్కడి వారంతా భయాందోళనతో పరుగులు తీశారు. అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిని కాల్చి చంపారు. పోలీసులు వెంటనే స్పందించడంతో ప్రాణనష్టం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.