Ram Gopal Yadav | ‘ఆ లేఖ గురించి అమిత్ షాను అడగండి’.. చీలికపై మంత్రి వ్యాఖ్యలను ఖండించిన ఎస్పీ ఎంపీ
Ram Gopal Yadav | సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పందించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎలాంటి లేఖ ఇవ్వలేదని తెలిపారు.
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పందించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎలాంటి లేఖ ఇవ్వలేదని తెలిపారు. ఓం ప్రకాష్ రాజ్‌భర్ దీని గురించి అమిత్ షాను అడగాలని ఆయన అన్నారు. (Ram Gopal Yadav) అమిత్ షాకు తాను ఎలాంటి లేఖ సమర్పించలేదని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నేను ఏదైనా లేఖ సమర్పించానా లేదా అనేది అమిత్ షాను మీరు అడగాలి’ అని రాజ్‌భర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.
కాగా, ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఎప్పుడూ ఇలాగే మాట్లాడతారని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. దేశంలో ఎవరూ కూడా ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోరని చెప్పారు. ‘అసలు తానేం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు’ అని ఆరోపించారు.
మరోవైపు తమ పార్టీలో అంతా సవ్యంగానే ఉన్నదని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ చీలికపై వస్తున్నవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని అన్నారు. ‘పార్టీలో ఎలాంటి సమస్య లేదు, భవిష్యత్తులోనూ ఉండదు. వారు కేవలం వదంతులు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారిని తిట్టుకుంటారు’ అని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

