న్యూఢిల్లీ : అశోక విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్ముదాబాద్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. బీజేపీ యువ మోర్చా నేత ఫిర్యాదుపై ఆయనను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అలీ ఖాన్ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చిన పోస్ట్‌లో, ‘ఆపరేషన్ సిందూర్’పై కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మీడియాకు వివరించడాన్ని మీడియా ఆర్భాటంగా వర్ణించారు.
ఈ ఆర్భాటం క్షేత్ర స్థాయిలో వాస్తవ రూపం దాల్చాలని, లేదంటే ఇదంతా కేవలం నయవంచన అవుతుందని పేర్కొన్నారు. ఆయనకు హర్యానా మహిళా కమిషన్ కూడా నోటీసులిచ్చింది.