ముంబై: అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంకు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఔరంగాబాద్ ఈస్ట్‌లో ఈ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ ఓడిపోయారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి అతుల్ సావే 2,161 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గంలో ఏఐఎంఐఎం అభ్యర్థి నసీరుద్దీన్ సిద్ధిఖీపై శివసేన అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్ 8,119 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.