Odisha train tragedy | పేరుకుపోయిన గుర్తించని మృతదేహాలు.. శవాలతో నిండిన మార్చురీలు
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మరణించిన వందలాది మందిని గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లోని మార్చురీలు శవాలతో నిండిపోయాయి.
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మరణించిన వందలాది మందిని గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లోని మార్చురీలు శవాలతో నిండిపోయాయి. రైలు ప్రమాద దుర్ఘటనలో 288 మంది మరణించగా, 900 మందికిపైగా గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు. బాలాసోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నిండిపోవడంతో ఒడిశా ప్రభుత్వ అధికారులు స్పందించారు. 87 అంబులెన్స్‌లలో 187 మృతదేహాలను భువనేశ్వర్‌లోని పలు ఆసుపత్రులకు తరలించారు. అక్కడి ఎయిమ్స్ ఆసుపత్రిలో 110 గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరిచారు. మరో 77 మృతదేహాలను భువనేశ్వర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్, అమ్రీ హాస్పిటల్, సమ్ హాస్పిటల్‌తోపాటు మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
కాగా, ఒక్కో ఆసుపత్రిలో గరిష్ఠంగా 40 మృతదేహాలను మాత్రమే భద్రపరిచే వీలుందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైళ్ల ప్రమాదంలో మరణించిన వందలాది మంది మృతదేహాలను గుర్తించే వరకు మార్చురీలో ఉంచడం చాలా కష్టసాధ్యమని అన్నారు. దీంతో శవపేటికలు, ఐస్, రసాయనాలు సమకూర్చుకుని మృతదేహాలను భద్రపరిచే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వేసవి కావడంతో మృతదేహాలు త్వరగా పాడవుతాయని అన్నారు. శనివారం రైలు ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రులను సందర్శించిన ప్రధాని మోదీ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

