Tej Pratap Yadav : బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) లో మా పార్టీ అధికారంలోకి రాబోతున్నదని, మా ప్రభుత్వం ఏర్పాటవగానే రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలను నిలిపివేయడంపైనే ప్రధానంగా దృష్టి పెడుతామని జన్‌శక్తి జనతాదళ్ పార్టీ (Jan Shakti Janata Dal) అధ్యక్షుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) చెప్పారు.
అంతేగాక తాము బీహార్‌ను నిరుద్యోగంలేని రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తేజ్ ప్రతాప్ హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా తాను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జన్‌శక్తి జనతాదళ్ వేవ్ కనిపిస్తున్నదని చెప్పారు. కాగా బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. నవంబర్ 14న ఓట్లను లెక్కించనున్నారు.