న్యూఢిల్లీ : న్యూఢిల్లీ రాజకీయాల్లో మరోసారి శీష్ మహల్ (అద్దాల మేడ) వివాదం తెరపైకి వచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు ఆయన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ప్రభుత్వం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెవెన్ స్టార్ బంగ్లాను కేటాయించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని బీజేపీ ఆరోపించింది.
‘సామాన్యుడిగా చెప్పుకునే ఈ వ్యక్తి పాత శీష్ మహల్‌ను ఖాళీ చేసిన తర్వాత పంజాబ్‌లో మరో శీష్ మహల్’ను నిర్మించుకున్నారు. వంద కార్ల కాన్వాయ్‌తో ఆ పార్టీ అగ్రనేత కేజ్రీవాల్‌కు వీవీఐపీ సెక్యూరిటీ కల్పించడమే కాక, 7 స్టార్ మేన్షన్ కూడా కేటాయించారు’ అని బీజేపీ విమర్శించింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆప్ రెబల్ ఎంపీ స్వాతి మలివాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాగా, బీజేపీ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది.