న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ పట్ల ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి అమిత్ షా అదేశాల మేరకు ఆయనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మంత్రిగా ఉన్న సమయంలో మురుగునీటి శుద్ధి టెండరింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సత్యేంద్ర జైన్, మరో ఐదుగురిని మంగళవారం ఈడీ అరెస్ట్ చేసింది.
దీనిపై కేజ్రీవాల్ ఎక్స్‌లో స్పందించారు. ‘సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని ఏసీబీ అధికారులు ఉదయం వరకు చెబుతూ వచ్చారు. అయితే మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది. ‘సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేయండి’ అంటూ అమిత్ షా నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో వారిని ఈడీ అరెస్ట్ చేసింది’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.