శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 24: జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(జీహెచ్ఐఏఎల్)..బ్రస్సెల్స్ విమానాశ్రయంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో హైదరాబాద్-యూరప్‌ల మధ్య కార్గో కనెక్టివిటీ పెరుగడంతోపాటు ఇరు ప్రాంతాల మధ్య సరుకు రవాణా మరింత సులభతరం కానున్నదని ఎయిర్‌పోర్టు ప్రతినిధులు తెలిపారు.
గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరుసంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పందంతో కార్గో రంగంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెరుగైన స్థానంలో ఉంటుందని వివరించారు.