Arunachal Helicopter Crash: లభించిన ఐదో మృతదేహం.. ముగిసిన రెస్క్యూ ఆపరేషన్
Arunachal Helicopter Crash | అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ప్రమాదంలో మరణించిన ఐదో జవాన్ మృతదేహం
తేజ్‌పూర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ప్రమాదంలో మరణించిన ఐదో జవాన్ మృతదేహం కూడా లభ్యం కావడంతో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్‌ను ముగిస్తున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం లోయర్ సియాంగ్ జిల్లాలోని లికబలి నుంచి బయలుదేరిన హెలికాప్టర్ 10:43 గంటలకు మిగ్గింగ్ గ్రామంలో కుప్పకూలింది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఐదుగురు జవాన్లు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే ఒక మిగ్-17 విమానం, రెండు హెలికాప్టర్లతో ఏరియల్ రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి వెళ్లాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి రోడ్డు మార్గం లేకపోవడంతో మూడు ఆర్మీ బృందాలు కాలినడకన అక్కడికి చేరుకున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నానికి రెండు మృతదేహాలు లభ్యంకాగా మిగిలిన ముగ్గురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో జవాన్ కోసం ఇవాళ కూడా రెస్క్యూ నిర్వహించగా ఈ సాయంత్రం అతని మృతదేహం లభ్యమైంది. దాంతో ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను ముగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

