న్యూఢిల్లీ, జూన్ 13: భారత పరిస్థితులకు అనుగుణంగా, తక్కువ ధరకే లభించే కృత్రిమ కాలును ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేశారు. సాధారణంగా కృత్రిమ కాలున్నవారు కింద కూర్చోలేరు. తాజాగా తయారు చేసిన కాలు కింద కూర్చోవటానికి కూడా వీలుండేలా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని, త్వరలోనే కృత్రిమ కాలుకు మరిన్ని అత్యాధునిక ఫీచర్లు జోడించి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు పేర్కొన్నారు. 100 కిలోల బరువును ఈ కాలు తట్టుకోగలుగుతుందని, ధర రూ.25 వేలు అని వెల్లడించారు.