ముంబై: దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మళ్లీ తిరిగొచ్చినా అధికరణ 370ని పునరుద్ధరించడం సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా అమిత్ షా బుధవారం ధూలే, పర్బని, జలగావ్లలో మహాయుతి తరపున ప్రచారం చేశారు.
మహా వికాస్ అఘాఢీలోని కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లపై విరుచుకుపడ్డారు. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను ముస్లింలు పొందలేరన్నారు.