జమ్మూ: జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్, పీడీపీ సోమవారం ‘బ్లాక్ డే’గా పాటించాయి. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఈ పార్టీలు వేర్వేరుగా నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో డిమాండ్ చేశాయి. కాగా, సోమవారం అమర్నాథ్ యాత్ర ను నిలిపేశారు. జమ్ము కశ్మీర్ శాసనసభ ఎన్నికలు సెప్టెంబర్లో జరుగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అధికరణ 370 రద్దు జరిగిన రోజును ‘ఏకాత్మ మహోత్సవం’గా బీజేపీ నిర్వహించింది.
జమ్మూ కశ్మీరులోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్నూర్, సుందర్బని సెక్టర్లలో చొరబాటుదారులు రెండు బృందాలుగా వస్తున్నట్లు అనుమానించిన సైన్యం కాల్పులు జరిపింది. సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.