Toilets in Schools | న్యూఢిల్లీ : దేశంలోని 97.5 శాతం విద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించినట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ సౌకర్యం ఉన్నట్టు సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ప్రభుత్వ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 6 నుంచి 12 తదగతుల వరకు చదివే బాలికలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేయాలని, వారికి ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు.
దేశంలోని 10 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 16 లక్షల మరుగుదొడ్లు బాలురకు, 17.5 లక్షలు బాలికలకు నిర్మించామని, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల్లో బాలురకు 2.5 లక్షలు, బాలికలకు 2.9 లక్షల టాయిలెట్లను నిర్మించినట్టు కేంద్రం తెలిపింది.