ముంబై : మహారాష్ర్టలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని ఈస్ర్టన్ ఎక్స్ప్రెస్ హైవేపై రాత్రి 2 గంటల సమయంలో లారీ బోల్తా పడింది. ఈ లారీలో 20 టన్నుల టమాను తరలిస్తుండగా ప్రమాదం జరగ్గా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో.. లారీలోని టమాను క్రేన్ సహాయంతో పక్కకు పడేశారు. 20 టన్నుల టమాటా పూర్తిగా పాడైంది.
#WATCH | Thane, Maharashtra: Around 20 tonnes of tomatoes, scattered on Eastern Express Highway, being removed amid a huge traffic jam on both lanes of the Highway
— ANI (@ANI) July 16, 2021
One person was injured after a tomato-laden truck overturned near Kopari, Thane on the Highway at around 2 am today pic.twitter.com/GPOmfgd1nO