Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ .. టెర్రర్ క్యాంపుల లిస్టును రిలీజ్ చేసిన ఆర్మీ
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌లో ఉన్న ఏడు ఉగ్రవాద క్యాంపులపై భారతీయ బలగాలు దాడి చేశాయి. ఆ ఆపరేషన్ చేపట్టి ఏడాది సమీపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏడు క్యాంపుల జాబితాను ఆర్మీ రిలీజ్ చేసింది. రెండు క్యాంపులపై ఐఏఎఫ్ దాడి చేయగా, మిగితా క్యాంపులపై ఆర్మీ అటాక్ చేసింది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి ఏడాది సమీపిస్తున్నది. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా గత ఏడాది మే 7వ తేదీన భారత బలగాలు పాకిస్థాన్ స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి సమయంలో పాకిస్థాన్‌లో ఉన్న టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసిన లిస్టులను ఆర్మీ రిలీజ్ చేసింది. మొత్తం ఏడు స్థానాల్లో దాడి చేశారు. ఆ సైట్లకు చెందిన శాటిలైట్ చిత్రాలను ఆర్మీ రిలీజ్ చేసింది. కోట్లి గుల్పుర్, మెహమూనా జోయా, సేద్నా బిలాల్, బింబేర్, స్వాని నాలా, సర్జల్ ప్రాంతాల్లో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. మిలిటరీ హెడ్‌క్వార్టర్స్ ఇచ్చిన టార్గెట్లపై ఆర్మీ దాడి చేసింది. ఇక భారతీయ వైమానిక దళం అదనంగా మరో రెండు స్థావరాలపై అటాక్ చేసింది. మే 7వ తేదీన అర్థరాత్రి ఒంటిగంటకు వైమానిక దాడలు చేశారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ఆ దాడి చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఆ ప్రతీకార దాడుల నేపథ్యంలో మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
పాకిస్థాన్ భూభాగంలో సుమారు 60 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న స్థావరాలను ఆర్మీ టార్గెట్ చేసింది. ఇక వైమానిక దళం మాత్రం మరింత దూరంలో ఉన్న టార్గెట్లపై అటాక్ చేసింది. భారతీయ అమ్ములపొదిలో ఉన్న అత్యాధునిక ఆయుధాలను మే 7వ తేదీ జరిగిన దాడుల్లో వినియోగించారు. బిల్డింగ్‌లను, క్లస్టర్లను టార్గెట్ చేశారు. ముర్దికే, బవాహల్పుర్లో ఉన్న క్యాంపులను వైమానిక దళం టార్గెట్ చేసింది. మిగితా లొకేషన్లను ఆర్మీ టార్గెట్ చేసింది. అమెరికా తయారీకి చెందిన ఎం777 హోవిజర్ గన్ను ఈ ఆపరేషన్ కోసం ఆర్మీ వాడింది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను ఆ గన్‌తో ఎంతో కచ్చితత్వంతో పేల్చగలరు. తమ దాడుల్లో భాగంగా ఆర్మీ కమికేజ్ డ్రోన్లను వాడినట్లు తెలుస్తోంది. నిర్దేశిత టార్గెట్లను వీటితో స్ట్రయిక్ చేశారు. స్వదేశీ, విదేశీ తయారీ సిస్టమ్‌తో ఆపరేషన్ సింధూర్ నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

