న్యూఢిల్లీ: నిహంగ్ వర్గ సిక్కులు ఉత్తరాఖండ్‌లోని నాగరాసు గురుద్వారాను దిగ్భంధించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ మూడు రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కత్తులు, బల్లాలతో కొందరు సిక్కులు ఆ గురుద్వారాను ఆధీనంలోకి తీసుకున్నారు. చమోలీలో జూన్ 16వ తేదీన స్థానికులతో జరిగిన ఘర్షణ అంశంలో నలుగురు నిహంగ్ సిక్కులను అరెస్టు చేశారు. అయితే వారిని విడుదల చేయాలని కోరుతూ మరో 8 మంది నిహంగ్ సిక్కులు గురుద్వారాలో కొందర్ని బంధీగా చేశారు. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రతిష్టంభన కొనసాగడంతో.. ఆ గురుద్వారా వద్ద ఇవాళ ఆర్మీని మోహరించారు. పోలీసులు, ఐటీబీపీ పోలీసులు కూడా అక్కడే ఉన్నారు.
జూన్ 20వ తేదీన కర్ణప్రయాగ్ వెళ్లేమార్గంలో 8 మంది నిహంగ్ సిక్కులు నాగరాసులోని గురుద్వారాను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ఓ భక్తుడిని, సేవాదార్ను బంధీగా చేసి, ఆ గురుద్వారాలోని మూడవ ఫ్లోర్లో తిష్టవేశారు. అయితే నిహంగ్ సిక్కులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని చూస్తున్నట్లు ఎస్పీ నిహారికా తోమర్ తెలిపారు. చర్చలు పాజిటివ్ దశలో ఉన్నాయని, ఓ నిహంగ్ సిక్కు మూడవ ఫ్లోర్ నుంచి కిందకు దిగి ప్రభుత్వాధికారులతో మాట్లాడారని, మిగితా వారితోనూ చర్చలు జరుగుతున్నట్లు ఎస్పీ చెప్పారు.
నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు 60 మందికి సరిపడా బస ఏర్పాటు చేయాలని కూడా నిహంగ్ సిక్కులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ డిమాండ్‌ను గురుద్వారా మేనేజ్మెంట్ తీర్చలేకపోయింది. శ్రీ హేమకుండ్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జూన్ 16వ తేదీన కర్ణప్రయాగ్ మార్కెట్లో పార్కింగ్ కోసం వివాదం జరిగింది. అక్కడ జరిగిన వాగ్వాదం హింసకు దారి తీసింది. నిహంగ్ సిక్కులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో మొహాలీకి చెందిన నలుగురు నిహంగ్ సిక్కులను అరెస్టు చేశారు.
36 hours in. Still not over.
Two of the seven Nihang Sikhs who occupied Gurudwara Langar Damdama Saheb in Nagrasu, Rudraprayag on Saturday evening have come down from the roof. Two others have already left after apologising to the Rudraprayag administration. But five remain on… pic.twitter.com/tkQW4ILSMD
— Kumaon Jagran (@KumaonJagran) June 22, 2026