ముంబై : ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించారు. కొత్త ప్రాజెక్టులను అంగీకరించబోనని తెలిపారు. తనను ఇంత కాలం ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇప్పటి వరకు తన ప్రస్థానం అద్భుతంగా ఉందన్నారు.
అయితే రిటైర్మెంట్కు కారణాలేమిటో ఆయన వెల్లడించలేదు. సినిమాల కోసం పాడటం మానేసినా, ఆయన ఇండిపెండెంట్ గాయకుడిగా కొనసాగుతారని తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: రైలు రాకలో అనూహ్య ఆలస్యం జరిగి ఒక విద్యార్థిని భవిష్యత్తుకు తీవ్ర నష్టం చేకూర్చిన రైల్వే శాఖ రూ.9.10 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. యూపీలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి బీఎస్సీ ఎంట్రెన్స్ పరీక్షకు వెళ్లేందుకు 2018, మే 7న బస్తీ నుంచి లక్నోకు ఇంటర్సిటీ సూపర్‌ఫాస్ట్ రైలుకు టికెట్ బుక్ చేసుకుంది.
అయితే రైలు ఆలస్యం కారణంగా ఆమె పరీక్ష రాయలేకపోయింది. మధ్యాహ్నం 11 గంటలకు లక్నో చేరాల్సిన రైలు రెండున్నర గంటల ఆలస్యంగా 1.30కు చేరుకుంది. ఆమె సకాలానికి చేరుకోలేక పరీక్ష రాయలేకపోయింది.