Arif Mohammed Khan | బీహార్, కేరళ రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన గవర్నర్లు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ కేరళ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ (Arif Mohammed Khan).. తాజాగా బీహార్ గవర్నర్గా ప్రమాణం చేశారు. అదేవిధంగా ఇన్ని రోజులూ బీహార్ గవర్నర్ (Bihar Governor)గా పనిచేసిన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (Rajendra Arlekar) కేరళ గవర్నర్గా గురువారం ప్రమాణం చేశారు.
#WATCH | Patna | Arif Mohammed Khan takes oath as Governor of Bihar pic.twitter.com/i4m0a241QV
— ANI (@ANI) January 2, 2025
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది. ఈ మేరకు గత నెల 24న రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Thiruvananthapuram | Rajendra Arlekar takes oath as Governor of Kerala pic.twitter.com/INRSrjNyjw
— ANI (@ANI) January 2, 2025
Also Read..
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం
PM Modi | మోదీని కలిసిన గాయకుడు దిల్జిత్.. 2025 ఏడాది గొప్పగా ప్రారంభమైందంటూ పోస్ట్