CBSE, Revaluation | విద్యార్థుల జీవితాలతో ఆటలా?.. సీబీఎస్ఈపై విమర్శల వెల్లువ
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారా? అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- అక్షరాలు కూడా కన్పించని స్కాన్డ్ కాపీలు ఇచ్చిన బోర్డు
- వాటితో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు ఎలా అని ఆగ్రహం
న్యూఢిల్లీ, మే 21: విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారా? అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 12వ తరగతి జవాబుపత్రాల స్కాన్డ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకుని, వాటిని వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న పలువురు విద్యార్థులు వాటిని చూసి షాక్ తిన్నారు. అస్పష్టంగా అక్షరాలు కన్పించకుండా ఉన్న స్కాన్డ్ కాపీలు చూసి, సీబీఎస్ఈ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రాసిన జవాబు పత్రాలను తామే చదవలేక పోతున్నామని, ఈ కాపీలను టీచర్లు వాల్యుయేషన్ చేసి మార్కులు ఎలా వేశారని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ కాపీలను చూసే మార్కులేశారా? అసలు చదవడానికే వీలుగా లేని ఈ జవాబు పత్రాల ఆధారంగా మేం రీ వాల్యుయేషన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలని వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ స్కాన్డ్ కాపీల స్క్రీన్ షాట్లను పలువురు ఎక్స్‌లో షేర్చేశారు. ప్రభుత్వం చేసిన తప్పునకు పరిహారంగా ప్రతి విద్యార్థికి 15-20 గ్రేస్ మార్కులు కలుపాలని పలువురు డిమాండ్ చేశారు. కాగా, 12వ తరగతి జవాబుపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును మే 22 నుంచి 23వ తేదీ వరకు పొడిగించినా వెబ్సైట్లో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CBSE
- Parents
- Revaluation
- students
RELATED ARTICLES
తాజా వార్తలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

