Mansukh Mandaviya | ప్రపంచ వ్యాప్తంగా (World wide) ప్రజల జీవితం కరోనా వైరస్ (Corona Virus) కు ముందు ఆ తర్వాత అని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా వైరస్ మహమ్మారి దేశ ఆర్థిక పరిస్థితులపైనే కాదు.. ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ సోకిన తర్వాత అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో యువత కూడా 30 ఏండ్ల వయసులోనే గుండెపోటుతో (Heart Attacks) మరణిస్తున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కొవిడ్ కారణంగానే యువత ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొవిడ్ (Covid-19) - గుండెపోటు (Heart Attack)కు మధ్య సంబంధం ఉందేమోనని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి (Union Health Minister ) మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) స్పందించారు.
‘చాలా మంది యువ కళాకారులను, అథ్లెట్లు, క్రీడాకారులు అకస్మాత్తుగా కుప్పకూలిన ఘటనలు మనం చూశాం. ఈ ఘటనలపై కచ్చితంగా అధ్యయనం చేయాల్సి ఉంది. కొవిడ్, గుండెపోటు మధ్య సంబంధం ఉందేమో పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. దీనికోసం ఓ పరిశోధనను ప్రారంభించాం. దీని తాలూకూ ఫలితాలు రెండు లేదా మూడు నెలల్లో రావొచ్చు’ అని మంత్రి వెల్లడించారు.
ఇదే సందర్భంలో ఇటీవల కొవిడ్ కేసులు (Covid Cases) పెరుగుతున్న తరుణంలో నాలుగో వేవ్ ( fourth wave ) వచ్చే అవకాశాల గురించి మాండవీయ స్పందించారు. దేశంలో మొత్తం 214 కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. వీటిల్లో కొన్ని ఉపవేరియంట్ల కారణంగా ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్ బీఎఫ్ 7 వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఎక్స్‌బీబీ 1.16 సబ్ వేరియంట్ వచ్చిందని, దీనివల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని చెప్పారు.
ఇక ఈ వేరియంట్లేవీ భారీ సంక్షోభాలు కలిగించేంతటి ప్రమాదకరమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. కేసుల్లో పెరుగుదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్, ఇతర క్రిటికల్ కేర్ ఏర్పాట్లు అన్నీ రెడీగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం కనిపిస్తున్న అన్ని వేరియంట్లపైనా మన వ్యాక్సిన్లు పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
Also Read..
Samantha | శోభిత-నాగచైతన్య డేటింగ్‌పై సమంత కామెంట్లు వైరల్..!
India Corona | గత 24 గంటల్లో 3,038 కొత్త కేసులు.. తొమ్మిది మంది మృతి
CM KCR | సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన జాతీయ మేధావులు