చెన్నై : దేశంలో ఆపిల్ ఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ కంపెనీ ప్లాంట్ ఈ వారం ఐదు రోజులపాటు మూతపడనున్నది. ఇటీవల ఫుడ్ పాయిజన్ ఘటన జరిగినప్పటి నుంచి నుంచి కంపెనీలో ఉద్యోగులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లాంట్‌కు ఐదు రోజులు సెలవులు ప్రకటించినట్లు కాంచీపురం పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ విషయాన్ని తమిళనాడు సీనియర్ అధికారి ఒకరు కూడా ధ్రువీకరించారు.
అయితే, ఈ విషయంపై ఫాక్స్‌కాన్, యాపిల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గత వారం ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనతో ఆసుపత్రి పాలైన 150 మంది కార్మికులకు మద్దతుగా నిరసనగా హైవేను దిగ్బంధించిన పలువురిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్లాంట్ ఐఫోన్-12ను తయారు చేస్తుంది.
తమిళనాడులోని పరిశ్రమ భద్రతకు సంబంధించిన అధికారి మాట్లాడుతూ గత శనివారం నుంచి మూసివేయబడిందని, ఆదివారం వరకు మూసివేయబడుతుందని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు కార్యకలాపాలపై ప్రభావం చూపనున్నది తెలిపారు. మంగళవారం ఫ్యాక్టరీలో ఒక్క కార్మికుడు కూడా కనిపించకపోవడంతో గేటు వద్ద పోలీసు వాహనాలు నిలిచిపోయాయి. 2020 డిసెంబర్లో కూడా కార్మికులు జీత భత్యాలు డిమాండ్ చేస్తూ ప్లాంట్‌ను ధ్వంసం చేశారు. దీంతో కంపెనీకి 60 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
దేశంలో ఐఫోన్-13 తయారీని (అసెంబ్లీ) కూడా ఆపిల్ ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఐఫోన్-13 చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నది. ఫాక్స్‌కాన్ ఆపిల్ అనుబంధ సంస్థ అని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. దేశంలో ఐఫోన్ 13 తయారు చేయడం ద్వారా దేశీయ మార్కెట్లో ధరలను తగ్గుతాయని, ఎగుమతులు పెరుగుతాయని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రానున్నాయి.