కోటా: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. బుధవారం మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అహ్మదాబాద్‌కు చెందిన అఫ్షా షేక్ అనే యువతి జవహర్ నగర్లో సూసైడ్ చేసుకుంది. నీట్ శిక్షణ కోసం వచ్చిన ఆమె హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది.
ఇది జరిగిన కొద్ది గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకుంది. అసోం నాగోన్కు చెందిన పరాగ్ అనే విద్యార్థి మహావీర్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల సంఖ్య ఆరుకు చేరుకుంది.