కోటా: వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థి తనువు చాలించాడు. నీట్ కోచింగ్కు చిరునామాగా మారిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. కోటాలో కోచింగ్ తీసుకుంటున్న ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్కు చెందిన మన్జ్యోత్ ఛబ్రా వసతి గృహంలో విగతజీవిగా కనిపించాడు. కోటాలో ఏటా లక్షల మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. కాగా, ఈ ఏడాది 17 మంది విద్యార్థులు మృతిచెందారు.