న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును ఢిల్లీ కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ ఢిల్లీ విభాగాధిపతి అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేసినట్లుగానే మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయా, నసీబ్ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేసి, తమ నిరసనను ప్రకటించారు. వీరిద్దరూ వేర్వేరుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తమ రాజీనామా లేఖలను పంపించారు. ఆప్తో పొత్తువల్ల కాంగ్రెస్ కార్యకర్తలు అవమానానికి గురయ్యారని తెలిపారు. ఎంత మాత్రం తాను పార్టీలో ఇమడలేనన్నారు. ఆప్, కాంగ్రెస్ మధ్య పంజాబ్లో పొత్తు లేదు. కానీ ఢిల్లీలో ఈ రెండు పార్టీలు లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి.