MDMK Quits DMK Alliance | స్టాలిన్‌కు మరో షాక్.. డీఎంకే కూటమి నుంచి వైదొలిగిన ఎండీఎంకే
MDMK Quits DMK Alliance | తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు మరో షాక్ ఎదురైంది. ఆయన నేతృత్వంలోని డీఎంకేతో 9 ఏళ్లుగా కలిసి ఉన్న ఎండీఎంకే ఆ కూటమి నుంచి వైదొలగింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది.
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు మరో షాక్ ఎదురైంది. ఆయన నేతృత్వంలోని డీఎంకేతో 9 ఏళ్లుగా కలిసి ఉన్న ఎండీఎంకే ఆ కూటమి నుంచి వైదొలగింది. పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నది. (MDMK Quits DMK Alliance) ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని స్వాగతించడంతో పాటు ఎన్నికల హామీల విషయంలో రాజీపడకుండా వ్యవహరించాలని ఒక తీర్మానంలో కోరింది. అవినీతి రహిత పాలన అందించాలని, మెకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్ వంటి అంశాలపై తమిళనాడు హక్కులను పరిరక్షించడం వంటి వాటిపై ప్రభుత్వం దృఢంగా ఉండాలని సూచించింది. అయితే అధికార టీవీకే కూటమి వైపు ఎండీఎంకే మొగ్గుచూపుతున్నప్పటికీ అందులో చేరడం గురించి ఆమోదించిన తీర్మానాల్లో స్పష్టంగా ప్రస్తావించలేదు.
కాగా, డీఎంకే కూటమి నుంచి వైదొలగడాన్ని ఎండీఎంకే సమర్థించుకున్నది. తమ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయని విమర్శించింది. అలాగే తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకే వద్ద ఒక రహస్య ప్రణాళిక ఉన్నట్లు ఆరోపించింది. ఈ పరిస్థితుల వల్ల డీఎంకే కూటమిలో కొనసాగడం అసాధ్యమని పేర్కొంది.
అయితే ఎండీఎంకే ఆరోపణలను డీఎంకే ఖండించింది. అసెంబ్లీ, పార్లమెంటులో ఎండీఎంకే ప్రాతినిధ్యం పొందేలా చేసింది డీఎంకేనే అని ఆ పార్టీ నేత సయ్యద్ హఫీజుల్లా తెలిపారు. ‘వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకంగా వైకో సాగించిన పోరాటానికి ఇది పూర్తిగా విరుద్ధం. ఎండీఎంకేలో ఆయన కుమారుడు దురై వైకోకు ఉన్నత స్థానం కల్పించడమే ఆ పార్టీ బలహీనపడటానికి కారణం’ అని ఆయన అన్నారు.
మరోవైపు డీఎంకే కూటమి నుంచి ఎండీఎంకే వైదొలగడంపై ఆ పార్టీలో అసమ్మతి రాజుకున్నది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గుర్తుపై గెలిచిన ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తాము డీఎంకేతోనే కొనసాగుతామని సంకేతాలు ఇచ్చారు. సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని వారు బహిష్కరించారు. దీంతో ఎండీఎంకే అధికారికంగా టీవీకేతో జతకట్టినప్పటికీ, అధికార పార్టీ శాసనసభా బలం పెరుగదు. అలాగే ఉప ఎన్నికలకు దారితీసే పరిస్థితి కూడా ప్రస్తుతం లేనట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Another
- DMK Alliance
- MDMK
- MK Stalin
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinidhi Shetty | ఒక్కో సినిమాకు రూ.8 కోట్లు తీసుకుంటున్నానా .. ప్రచారాలపై శ్రీనిధి శెట్టి క్లారిటీ..!
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

