MIM Poster : ‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’.. వివాదంలో ఎంఐఎం పోస్టర్
MIM Poster : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టరొకటి ఉత్తరప్రదేశ్‌లో వివాదానికి దారితీసింది. ‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’ అని రాసి ఉన్న పోస్టర్...

సంభాల్: (MIM Poster) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టరొకటి ఉత్తరప్రదేశ్‌లో వివాదానికి దారితీసింది. ‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’ అని రాసి ఉన్న పోస్టర్ బుధవారం నాటి బహిరంగ సభలో ప్రధాన ఆకర్శణగా నిలిచింది. అయితే, ఈ పోస్టర్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పోస్టర్లను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం ఒవైసీకి తగదని హితవు పలికింది.
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) బుధవారం నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభ వేదికపై ఉంచిన పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చేపట్టిన ర్యాలీలో ‘ఘాజీల భూమి’ అన్న అర్ధం వచ్చే పోస్టర్‌ను ఉంచారు. సంభాల్ జిల్లాను ఘాజీల భూమిగా ఎంఐఎం పేర్కొంటున్నది. ఇంతకుముందు ఒవైసీ అయోధ్య జిల్లా పర్యటన సందర్భంగా అయోధ్య జిల్లాను ఫైజాబాద్ అని పేర్కొంటూ పోస్టర్లు ముద్రించి అంటించారు. అప్పుడు కూడా ఎంఐఎం పోస్టర్లపై తీవ్ర దుమారం చెలరేగింది.
ఇది ముమ్మాటికీ ద్వేషపూరిత చర్యతో కూడుకున్న పోస్టర్ అని బీజేపీ విమర్శించింది. ఇలాంటి పేర్లను తీసుకురావడం ద్వారా మైనార్టీ ఓట్లను పొందాలని ఒవైసీ చూస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు రాజేశ్ సింఘాల్ ఆరోపించారు. భారతదేశంలో ఏ నగరం కూడా ఘాజీలది కాదని ఆయన చెప్పారు. ఖురాన్లో సంభాల్ ప్రాంతాన్ని ఘాజీల భూమిగా వర్ణించినట్లు చూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2018 నవంబర్‌లో ఫైజాబాద్ డివిజన్‌ను అయోధ్యగా మార్చింది.
మంగళవారం ఢిల్లీలోని అశోక రోడ్డులో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అధికారిక నివాసంపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘనటలో ఐదుగురు హిందూ సేన సభ్యులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే నెల ప్రారంభంలో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 100 నియోజకవర్గాల్లో తన అభ్యర్థును నిలుపాలని ఎంఐఎం భావిస్తున్నది.
ఇవి కూడా చదవండి..
పడిపోయిన ఆర్-వ్యాల్యూ.. మందగించిన కొవిడ్ వ్యాప్తి
శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
మెక్‌డోనాల్డ్స్ బర్గర్లో తేలు.. కేసు నమోదు
లక్షల మందిని బలిగొన్న ఇరాన్-ఇరాక్ యుద్ధానికి 41 ఏండ్లు
రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో బగ్.. గుర్తించిన 17 ఏండ్ల కుర్రోడు!
ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

