Watch: బెంగళూరులో కుంగి గుంతగా మారిన మరో రోడ్డు.. నెల రోజుల్లో మూడో ఘటన
బీజేపీ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్లు కుంగి గుంతలు ఏర్పడిన సంఘటనలు నెలలో ఇది మూడోది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపడుతున్న పనుల వల్ల ఇలా జరుగుతున్నట్లు జనం ఆరోపిస్తున్నారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో ప్రధాన రోడ్డు భాగం కుంగింది. పెద్ద గుంతగా ఏర్పడింది. దీంతో వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం మారుతీ నగర్‌లోని ఇత్తమాడు ప్రధాన రహదారిలో ఈ సంఘటన జరిగింది. ఒక చోట రోడ్డు కుంగి పెద్ద గొయ్యిగా ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు.
కాగా, బీజేపీ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్లు కుంగి గుంతలు ఏర్పడిన సంఘటనలు నెల రోజుల్లో ఇది మూడోది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా చేపడుతున్న పనుల వల్ల ఇలా జరుగుతున్నట్లు జనం ఆరోపిస్తున్నారు. ఇటీవల రోడ్డుపై ఆకస్మాత్తుగా ఏర్పడిన గుంతలో పడి ఒక బైకర్ గాయపడ్డాడు. దీనికి ముందు నిర్మిస్తున్న పిల్లర్ కూలడంతో ఒక మహిళ, చిన్నారి మరణించారు.
మరోవైపు ప్రధాన రోడ్లు కుంగి గుంతలమయం కావడంపై బెంగళూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఏ రోడ్డుపై గొయ్యి ఏర్పడుతుందో, ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.
#WATCH | Karnataka: A portion of Ittamadu Main Road in Bengaluru caved in this morning. The affected portion has been barricaded to prevent any mishap. Smart City work is going on nearby. pic.twitter.com/1V84COHZdV
— ANI (@ANI) January 21, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

