పాట్నా: బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. దీంతో ఒక నెల వ్యవధిలో కూలిన వంతెనల సంఖ్య 15కు పెరిగింది. తాజాగా, కోసి నది వరదల కారణంగా ఆరారియా జిల్లాలోని చిన్న వంతెన కూలిపోయింది. 2017లో గ్రామీణాభివృద్ది పథకం క్రింద రూ.1.25 కోట్లతో దీనిని నిర్మించారు. ఇది బీటలువారినట్లు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని అమ్హారా పంచాయతీ గ్రామస్థులు తెలిపారు. ఇది కూలిపోవడంతో అనేక గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందిపడుతున్నారు.