India-Pakistan Tensions | హహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నుంచి దిగుమతులను భారత ప్రభుత్వం నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. రాక్‌సాల్ట్, డ్రై ఫ్రూట్స్ సహా పలు ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున రాక్ సాల్ట్ ఆర్డర్స్‌ను రద్దు చేశారు. కొత్తగా పాక్‌కు ఆర్డర్ ఇవ్వడం ఆపేశారు. చాంబర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌కు చెందిన అశోక్ లాల్వానీ మాట్లాడుతూ రాక్ సాల్ట్ (కల్లుప్పు) ఉప్పు, ఖర్జూరం, నల్ల ఎండుద్రాక్ష, సబ్జా సీడ్స్ పాకిస్తాన్ నుంచి దిగుమతి దిగుమతి చేసుకుంటున్నట్లు అంజూర పండ్లు, ఎండుద్రాక్షలు పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు చేరుకుంటాయన్నారు. ప్రతి నెలా 250 నుండి 300 టన్నుల రాక్ సాల్ట్, 550-600 టన్నుల ఖర్జూరం, 15 టన్నుల పిస్తా-నల్ల ఎండుద్రాక్ష, సబ్జా సీడ్స్ వ్యాపారం జరుగుతుందన్నారు. పాకిస్తాన్ నుండి దిగుమతులపై నిషేధం కారణంగా, టోకు వ్యాపారులు ప్రస్తుతానికి పెద్ద మొత్తంలో రాక్ సాల్ట్ ఆర్డర్లను
రద్దు చేశారు. కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదన్నారు.
ఆగ్రా గ్రోసరీ కలర్ అండ్ కెమికల్ కమిటీ సభ్యుడు పవన్‌దీప్ కపూర్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 30 మంది డ్రై ఫ్రూట్స్ హోల్‌సేల్ వ్యాపారులు ఉన్నారని తెలిపారు. అందరూ పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎండుద్రాక్ష, పిస్తాపప్పులు, అంజూరలు దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. ఆగ్రాలో 25-30 టన్నుల అంజూరలు, 40-50 టన్నుల ఎండుద్రాక్ష వ్యాపారం జరుగుతుందన్నారు. ఇప్పుడు వాటిని ఇతర దేశాల ద్వారా దిగుమతి చేసుకోనున్నట్లు చెప్పారు. రవాణా ఖర్చు పెరుగుదల వాటి ధరలను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, మొత్తం వ్యాపార సంఘం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతుందన్నారు. అలాగే, పాకిస్తాన్ నుంచి దిగుమతులను నిలిపివేయడం వల్ల కాటన్ బట్టల ధరలపై ప్రభావం చూపుతుందని ఆగ్రా వ్యాపార్ మండల్ అధ్యక్షుడు టీఎన్ అగర్వాల్ పేర్కొన్నారు. పత్తిని పాక్ నుంచి దిగుమతి అవుతుందన్నారు. కాటన్ బట్టలకు డిమాండ్ వేగంగా పెరిగిందన్నారు. చొక్కాలు, ధోతీలు, లోదుస్తులు అన్నీ కాటన్ నుంచే తయారవుతున్నాయన్నారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలు సరిగా లేవని రాజీవ్ గుప్తా తెలిపారు. ఈ పరిస్థితుల్లో కాటన్ వస్త్రాల ధరలు పెరిగే అవకాశం ఉందని.. పాకిస్తాన్ నుంచి దిగుమతులను నిలిపివేయడంతో దేశంలోని కొంతమందిని మాత్రమే ప్రభావితం చేస్తుందని.. కానీ, పాకిస్తాన్ భారీ నష్టాలను చూస్తుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
హిందువులు ఉపవాసం ఉండే సమయాల్లో ఈ ప్రత్యేకమైన ఉప్పును వాడుతారు. ఈ ఉప్పును కల్లుప్పు. హిమాలయన్ స్టాల్ పేరుతో పిలుస్తుంటారు. ఈ ఉప్పు పాకిస్తాన్ నుంచి భారత్‌కు దిగుమతి అవుతుంది. ప్రస్తుతం, పహల్గాం ఉగ్రదాడి తర్వాత అన్ని రకాల దిగుమతులను నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏళ్లుగా భారత్ ఈ ఉప్పును చౌకగా దిగుమతి చేసుకుంటూ వస్తుంది. ఈ ఉప్పుని శుద్ధి చేయరు. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ మూడు అంశాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రాక్ సాల్ట్‌ని సేంధా నమక్గా పిలుస్తారు. సింధు ప్రాంతం వస్తున్నందున ఆ పేరు వచ్చింది. పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి వస్తుందున లాహోరీ ఉప్పు అని సైతం పేరుంది. ప్రస్తుత పాకిస్తాన్‌లోని వాయవ్య పంజాబ్‌లో నమక్ కోహ్ అనే ప్రసిద్ధ కొండ దగ్గర ఈ ఉప్పు కనిపిస్తుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు గని అయిన ‘ఖేవ్దా సాల్ట్ మైన్’ ఉంది. అంటారియోలోని సిఫ్టో కెనడా సాల్ట్ మైన్స్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఖేవ్దా సాల్ట్ మైన్ నుంచి ఏటా 4.65 లక్షల టన్నుల ఉప్పు వెలికి తీస్తుండగా.. రాబోయే 500 సంవత్సరాలకు ఇక్కడి నుంచే ఉప్పు సరఫరా అవుతుందని పేర్కొంటున్నారు. ఖేవ్దా సాల్ట్ మైన్‌లో 40 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉన్నది. ఇక్కడి నుంచి సేకరించి ఉత్తర భారత ఉపఖండానికి సరఫరా చేస్తారు. భారత్ రాజస్థాన్‌లోని సంభార్ నది నుంచి ఈ ఉప్పు ఉత్పత్తి అవుతుంది. కానీ, తక్కువ పరిమాణంలోనే లభిస్తుంది. నాణ్యత సైతం తక్కువగా ఉంటుంది. ఈ ఉప్పును ఆహార పదార్థాలు, ఔషధాల తయారీలో వినియోగిస్తారు.