AIADMK MLA Resigns | అన్నాడీఎంకేకు మరో షాక్.. ఆరో ఎమ్మెల్యే రాజీనామా
AIADMK MLA Resigns | తమిళనాడులోని అన్నాడీఎంకేకు మరో షాక్ ఎదురైంది. ఆరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ తాజాగా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
చెన్నై: తమిళనాడులోని అన్నాడీఎంకేకు మరో షాక్ ఎదురైంది. ఆరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్ తాజాగా తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. (AIADMK MLA Resigns) కరూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయన సోమవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విజయభాస్కర్, అధికార టీవీకేలో చేరవచ్చని తెలుస్తున్నది.
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేను వీడిన ఆరో ఎమ్మెల్యేగా విజయభాస్కర్ నిలిచారు. ఆయనకు ముందు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, విరాలిమలై ఎమ్మెల్యే సీ విజయభాస్కర్ రాజీనామా చేశారు. అంతకు ముందు నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరారు. ఆరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామాతో తమిళనాడులో ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో సీఎం విజయ్ వదులుకున్న తిరుచిరాపల్లి తూర్పు స్థానం కూడా ఒకటి.
మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో అసెంబ్లీలో ఆ పార్టీ బలంతో పాటు ప్రతిపక్షాల బలం కూడా తగ్గుతున్నది. అలాగే ఎడప్పాడి కే పళనిస్వామి నాయకత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతున్నది. ఎంజీ రామచంద్రన్ స్థాపించిన పార్టీని బలహీనపరిచేందుకు అధికార టీవీకే ప్రయత్నిస్తున్నదని, తమ ఎమ్మెల్యేలను ఆ పార్టీ వైపు తిప్పుకుంటోందని అన్నాడీఎంకే ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 6th Resignation
- AIADMK
- Another
- mla
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

