న్యూఢిల్లీ: ఢిల్లీలోవిద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసుల అణచివేత ఘటనలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రజాస్వామ్యంలో ఘర్షణల కంటే చర్చలే ఎప్పుడైనా మెరుగైన మార్గమని ఆ లేఖలో పేర్కొన్నారు.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అనుసరించిన బల ప్రయోగం అంత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.