జైపూర్: దీపావళి సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్లో త్యోహార్ స్వీట్ స్టాల్లో ‘స్వర్ణ ప్రసాదం’ పేరున తయారు చేసిన కేజీ మిఠాయికి పెట్టిన ధర ఎంతో తెలుసా? అక్షరాల లక్షా 10 వేల రూపాయలు. ఈ ధర వింటేనే గుండె గుబేల్మంటున్నదా? అయితే అంత ధర పెట్టడానికి గల కారణాన్ని ఆ స్వీట్ సృష్టికర్త అంజలి జైన్ వివరించారు.
తాము తయారు చేసిన మిఠాయిపై బంగారం, వెండి పూత పూస్తామని తెలిపారు. తమ స్వీట్లలో పైన్ గింజలు, కుంకుమ పువ్వు, బంగారు భస్మం ఉన్నాయని వెల్లడించారు. స్వచ్ఛమైన బంగారం పూత కారణంగానే ధర అధికంగా ఉందని పేర్కొన్నారు. బంగారు భస్మంలో ఆయుర్వేద లక్షణాలుంటాయన్నారు.