ముంబై: వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రియలన్స్ గ్రూపు ప్రతినిధిని అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం వెల్లడించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద అరెస్టు చేశారు. రిలయన్స్ పవర్( Reliance Power) సంస్థలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అశోక్ పాల్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకున్నది. పీఎంఎల్ఏ కింద కేసు ఫైల్ చేశారు. బ్యాంకులకు కోట్లు ఎగవేసిన కేసులో అనిల్ అంబానీకి చెందిన కంపెనీలపై ఈడీ దర్యాప్తు చేపడుతున్నది. ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసులో అతన్నిఢిల్లీ ఆఫీసుకు తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఆయన్ను జడ్జీ ముందు ప్రవేశపెట్టనున్నారు.
ఏడీఏ గ్రూపు కేసులో పాల్‌ను అరెస్టు చేశారు. యెస్ బ్యాంకుతో లింకున్న ఆర్థిక నేరాభియోగాలు నమోదు అయ్యాయి. ఏడీఏ గ్రూపుకు గతంలో అనిల్ అంబానీ నేతృత్వం వహించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూపు సుమారు 17 వేల కోట్ల ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంకు నుంచి మూడు వేల కోట్లు రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సొమ్మును డైవర్ట్ చేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సుమారు 68.2 కోట్ల ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినట్లు ఈడీ ఆరోపిస్తున్నది.