ANI-Twitter | సోషల్ మీడియా దిగ్గజం టిట్టర్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే దేశంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల బ్లూటిక్‌ను తొలగించి విమర్శల పాలైంది. సెలబ్రిటీల అకౌంట్స్‌ను గుర్తించేందుకు ఉపయోగపడే బ్లూటిక్‌ను సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సాధారణ యూజర్లకు సైతం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. ఎవరైతే డబ్బులు చెల్లించరో టిక్ మార్క్‌లను తొలగిస్తూ వస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రాతో పాటు పలువురి అకౌంట్స్‌ను ట్విట్టర్ తొలగించింది.
ఈ అయితే, వివాదం మరిచిపోక ముందే భారత్‌లోని లోని ప్రముఖ వార్తా సంస్థలైన ఎన్డీటీవీ, ఏఎన్ఐ అకౌంట్స్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. తమ ఖాతాను బ్యాన్ చేసిన విషయాన్ని ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 7.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని, దేశంలోని అత్యంత పెద్ద న్యూస్ ఏజెన్సీ అకౌంట్‌ను బ్లాక్ చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం ఆవ్యక్తం చేశారు. 13 ఏళ్ల లోపు వయసు నిబంధన (సోషల్ మీడియా సెన్సార్ రూల్)ను కారణంగా చూపుతూ ట్విట్టర్ తమ గోల్డ్ టిక్ తొలగించిందని స్మితా ప్రకాశ్ పేర్కొన్నారు. ఏఎన్ఐకు అందిచన మేయిల్ ప్రకారం.. ట్విట్టర్లో ఖాతాకు సంబంధించి 13 ఏళ్ల వయసు నిబంధనను ఏఎన్ఐ ఉల్లంఘించినట్లు పేర్కొంది. మరో వైపు ఎన్డీటీవీ అకౌంట్‌ను ట్విట్టర్ ఎందుకు బ్లాక్ చేసిందనే దానికి స్పష్టమైన కారణాలు మాత్రం వెల్లడించలేదు.
So those who follow @ANI bad news, @Twitter has locked out India’s largest news agency which has 7.6 million followers and sent this mail – under 13 years of age! Our gold tick was taken away, substituted with blue tick and now locked out. @elonmusk pic.twitter.com/sm8e765zr4
— Smita Prakash (@smitaprakash) April 29, 2023