ముంబై: ఒక యవకుడు రెచ్చిపోయాడు. రోడ్డుపైకి వచ్చి హంగామా చేశాడు. పొడవాటి కత్తితో బస్సుపై దాడి చేశాడు. (Teen Attacks Bus With Sword) బస్సు డ్రైవర్‌ను అసభ్యకరంగా తిట్టడంతోపాటు బెదిరించాడు. బస్సుతోపాటు ఆటో మరో వాహనం అద్దాలు ధ్వంసం చేశాడు. చివరకు పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. భాండూప్ ప్రాంతంలో నివసించే 16 ఏళ్ల యువకుడు దొంగతం చేశాడన్న ఆరోపణలతో అతడి బంధువు తిట్టాడు. దీంతో అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. శనివారం మధ్యాహ్నం రోడ్డుపైకి వచ్చి గట్టిగా అరుస్తూ హంగామా చేశాడు. చేతిలోని పొడవైన కత్తితో బెస్ట్ బస్సు అద్దలు పగులగొట్టాడు. కత్తిని చూపించి బస్సు డ్రైవర్‌ను బెదిరించాడు. అక్కడ పార్క్ చేసి ఉన్న వాటర్ ట్యాంకర్, ఆటో అద్దాలను కూడా పగులగొట్టాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జువైనల్ రిమాండ్ హోమ్‌కు తరలించారు
మరోవైపు గతంలో కూడా కొందరిని గాయపర్చడం, ప్రజా శాంతికి విఘాతం కలిగించడం వంటి పలు క్రిమినల్ కేసులు ఆ మైనర్ బాలుడిపై నమోదయ్యాయని పోలీస్ అధికారి వెల్లడించారు. తాజాగా ఆ యువకుడు కత్తితో రోడ్డుపై హంగామా చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A minor 16-year-old boy on Bhandup’s Tank road started attacking people and vehicles with a sword after his uncle called him a thief#Bhandup #MumbaiPolice detained him pic.twitter.com/QT8ktPhgZn
— Vinay Dalvi (@Brezzy_Drive) April 19, 2025