ఈ సారి దక్షిణాది రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. నదులు ఉప్పొంగుతున్నాయి. 36 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రాన్ని అత్యంత దారుణమైన వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ ఓ జంట తమ పెళ్లిని వాయిదా వేసుకునేందుకు ఇష్టపడలేదు. వరదల్లోనూ పడవపై వరుడి ఇంటికి వెళ్లిన వధువు కుటుంబ సభ్యులు, బంధువుల వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో వధువుతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రంగురంగు చీరలు, దుస్తులు వేసుకొని అందంగా తయారై కూర్చున్నారు. వధువు పెళ్లిగెటప్లో ఉండగా, వారంతా సంబురంగా పడవలో ప్రయాణించారు. ఈ వీడియోను ఉమా సుధీర్ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. వధూవరులు అశోక్, ప్రశాంతి మొదట ఆగస్టులో పెళ్లిచేసుకోవాలనుకున్నా ఆ సమయంలో వర్షాలుంటాయని భావించి వివాహాన్ని జూలైకి మార్చుకున్నారు. అయినా, వర్షాలు వెంటాడడంతో వరుడి ఇంటికి వధువు పడవలో వెళ్లాల్సి వచ్చింది.
Fully decked up #BrideOnBoat, making her way to d groom’s place along with family members: Prashanti & Ashok reportedly chose a date in July over August to have rain hassle-free wedding but a #TruantMonsoon left #AndhraPradesh‘s #Konaseema flooded #MonsoonWedding @ndtv @ndtvindia pic.twitter.com/iauxbSNIyQ
— Uma Sudhir (@umasudhir) July 15, 2022
Bride and family were not going to let the rains spoil the party; so, clad in silk finery, they set off in boats to the groom’s place, making their way through coconut groves !! #Godavari receiving huge surplus waters #AndhraPradesh #Konaseema @ndtv @ndtvindia #AshokWedsPrashanti pic.twitter.com/viytS8jUJ2
— Uma Sudhir (@umasudhir) July 15, 2022