ముంబైని ముంచెత్తిన వాన..
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. మహానగరంతోపాటు థానే, నవీ ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో ముంబైలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. మహానగరంతోపాటు థానే, నవీ ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో ముంబైలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. అంధేరీ సబ్వే పూర్తిగా నీటమునిగింది. మాతుంగా ప్రాంతంలో రోడ్లపై వరదలు పారుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిరాటంకంగా వర్షం కురుస్తుండటంతో నగరంలోని చాలా చోట్ల రహదారులు చెడిపోయాయి.
#WATCH | Maharashtra | Andheri Subway waterlogged in Mumbai as rain continues to lash the city pic.twitter.com/7kiRhDVjel
— ANI (@ANI) July 7, 2022
ముంబైలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది. మహానగరంలోని పలు ప్రాంతాల్లో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, గత 1 నుంచి ఇప్పటివరకు ముంబైలో 958 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని వెల్లడించింది. మరికొన్ని రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే వర్షపాతం తొందర్లోనే వెయ్యి మిల్లీమీటర్లకు చేరుతుందని ప్రకటించింది.
#WATCH | Maharashtra: Rain lashes parts of Mumbai; visuals from Matunga area pic.twitter.com/7xe1cfAap3
— ANI (@ANI) July 7, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

