Loksabha Elections 2024 | రాజ్యాంగాన్ని మార్చేందుకు కాషాయ పార్టీ కుట్ర : ఆనంద్ శర్మ
Loksabha Elections 2024 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కాంగ్రా అభ్యర్ధి ఆనంద్ శర్మ ఆరోపించారు.
Loksabha Elections 2024 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కాంగ్రా అభ్యర్ధి ఆనంద్ శర్మ ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు భద్రంగా ఉంటాయని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో సోమవారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు, ప్రజల మధ్య బీజేపీ చీలిక చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బీజేపీ తీరు దేశాన్ని బలహీనపరుస్తుందని దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆనంద్ శర్మ చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ఇలాంటి విభజన చిచ్చును ఆపగలమని అన్నారు.
ఓటుతోనే మనం సమానత్వం సాధించగలుగుతామని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పతనమని చెప్పారు. కానీ కాషాయ పార్టీ ఈ వైవిధ్యతను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఓటు ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు.
Read More :
Parkinson’s | కాఫీతో పార్కిన్సన్స్ దూరం.. తాజా అధ్యయనంలో వెల్లడి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
New Zealand: గాయపడ్డ ఇద్దరు కివీస్ క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

